
హుస్నాబాద్ పట్టణంలో ప్రతి సంవత్సరం జరిగే రేణుక ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా గురువారం ఎల్లమ్మ తల్లి కి మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో హుస్నాబాద్ పట్టణ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు కొంకటి నళిని దేవి,బొజు రమా దేవి, కొమటి స్వర్ణలత, పేరుక భాగ్యరెడ్డి, పున్న లావణ్య, చిత్తారి పద్మ పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.