నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని హనుమకొండ రోడ్ లో నాగార్జున మిల్క్ పార్లర్ ను శుక్రవారం జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో గల రైతుల నుండి స్వచ్ఛమైన పాలను సేకరించి శుద్ధిచేసి పాలు పాల ఉత్పత్తులను తయారు చేసి పాలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకొన్న నాగార్జున డైరీ పలు సేవా కార్యక్రమాలను అమలుపరుస్తూ, వినియోగదారులకు అందుబాటులో ఉంటూ ముందుకు కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిలేని అనిత, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య , నాగార్జున డైరీ
సీఈఓ బారాజ్ కృష్ణ ప్రసాద్, మేనేజర్ వెనిశెట్టి శివకుమార్, అసిస్టెంట్ మేనేజర్ గొర్ల విజయ్ కుమార్, వెంకటేష్, రాకేష్ నాగార్జున, మిల్క్ పార్లర్ ఏజెంట్ నోముల బాలయ్య వెంకటేశులు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.