వర్షానికి కూలిన ఇండ్లను చైర్‌పర్సన్‌ పరిశీలన

నవతెలంగాణ-శంకర్‌పల్లి
మూడు రోజులుగా ఎడతెరపి లెకుండా కురుస్తున్న వర్షానికీ శంకర్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని బుల్కాపూర్‌ వార్డులో మాల లక్ష్మీ, భర్త ప్రభాకర్‌ల ఇల్లు కూలిపోవడంతో భార్య లక్ష్మికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న శంకర్పల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి ప్రవీణ్‌ కుమార్‌, కమిషనర్‌ ఆర్‌.జ్ఞానేశ్వర్‌ కూలిపోయిన ఇంటిని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి గోడ కూలిపోయి మహిళ మాల లక్ష్మికి గాయాలు కాగా, ఆమెను ఆస్పత్రికి తరలించి, చికిత్స అయ్యే ఖర్చు అందిస్తామని ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా కూడా ఆర్థిక సాయం అందించడానికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా గృహలక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ప్రభుత్వం నుంచి అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ బి. వెంకటరాంరెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మమ్మ రాంరెడ్డి, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.