తెలంగాణ ప్రభుత్వం నుండి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి సఖీ కేంద్రాన్ని సందర్శించారు. సఖీ కేంద్రం లోని సిబ్బిందిని వారి వారి బాధ్యతలను అడిగి తెలుసుకున్నారు. సార్ప్ సంస్థ (సఖీసపోర్ట్ సంస్థ ) డాక్టర్ ప్రమీల , 2019 నుండి మొత్తం సఖీ లో నమోదు అయిన కేసుల కోసం వివరించడం జరిగిందని తెలిపారు. మొత్తంగా ఇప్పటి వరకు 1311 కేసులు నమోదు అయినవి అని తెలిపినమని, షెల్టర్ , సిబ్బింది చేసే సేవలు బాగున్నాయి అని ప్రశంసించారు. వీరితోపాటు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నరసింహారావు , సి.డి.పి.ఓలు స్వరాజ్యం , శైలజ పాల్గొన్నారు.