రూ.10 నాణెంపై చైతన్య క్యాంపెయిన్‌

– హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెల్లడి
హైదరాబాద్‌ : రూ.10 నాణేలను అంగీకరించడంపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజా చైతన్య క్యాంపెయిన్‌ను నిర్వహించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తమ 430 శాఖలు, 542 బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా రెండు రోజుల పబ్లిక్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ (పీఏసీ)ను చేపట్టినల్లు పేర్కొంది. ఈ క్యాంపెయిన్‌లో రూ.10.96 లక్షల విలువ చేసే రూ.10 నాణేలను పంపిణీ చేసినట్టు తెలిపింది. ఈ నాణెం చెల్లిబాటుపై ఉన్న అపోహలను తొలగించడం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.