కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చైతన్య

నవతెలంగాణ- భీంగల్: బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లికొండ గ్రామానికి చెందిన  చైతన్య , రహత్ నగర్ గ్రామ బీజేపీ అధ్యక్షుడు రాజేందర్, బీజేపీ ఎస్టీ సెల్  మండల  ఉపాధ్యక్షుడు లింబాద్రి, నరేష్, లక్ష్మణ్, గణేష్, శ్రీరామ్, శ్రీనివాస్ మరో 50 మంది బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ  లో చేరారు.  అలాగే రామ్ సింగ్ తండా సేవాలాల్ తండాలకు చెందిన పలువురు   బంజారులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ముత్యాల సునీల్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ గౌడ్, అనంతరావు,  జె జె నరసయ్య, రంజిత్, వాక మహేష్  కార్యకర్తలు పాల్గొన్నారు. సొంతగూటికి చేరిన రాజేశ్వర్.  మండలంలోని బాచనపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ బాల్కొండ అభ్యర్థి ముత్యాల సునీల్ రెడ్డి సమక్షంలో సొంతగూటికి చేరారు. రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వేముగంటి ప్రాజెక్ట్  చైర్మన్  గా పనిచేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈయన గ్రామ శాఖ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఈయనకు సునీల్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.