
జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో చైతన్య విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు కౌశిక్ యాదవ్, ప్రీతి, కృషిత్ లు ఎంపికైనట్లు కరస్పాండెంట్ రేణు కుమార్ తెలిపారు. అనంతరం కరస్పాండెంట్ మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులు డిసెంబర్ నెలలో జరిగే రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరంలో పాల్గొంటారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపాల్ అశోక్ యాదవ్, ఉపాధ్యాయులు అభినందించారు.