నవతెలంగాణ-కుల్కచర్ల
భూమి కోసం భూక్తి కోసం వెట్టిచాకిరీ విముక్తి కోసం, పోరాడి తెలంగాణ ప్రజల తెగువని పోరాట స్ఫూర్తి ప్రపంచానికి చాటిన నిప్పుకణిక, తెలంగాణ ఉద్యమకారిణి తొలి భూ పోరాటానికి నాంది పలికిన తెలంగాణ వీరవనీత (చిట్యాల ఐలమ్మ) చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని పలువురు నాయకులు అన్నారు. బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలో రజక సంఘం మండల అధ్యక్షులు రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి స్థానిక వార్డు సభ్యులు మోత్కూర్ వెంకటేష్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి చిట్యాల ఐలమ్మ 128వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్‌పై ఆమె విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మహరిశ్చందర్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బోలుసని భీంరెడ్డి, సర్పంచ్ సౌమ్య వెంకట్రామిరెడ్డి, బొమ్మిరెడ్డిపల్లి సర్పంచ్ చాకలి ఆంజనేయులు, కుల్కచర్ల ఎంపిటిసి ఆనందం, సీనియర్ అసిస్టెంట్ వెంకటయ్య , జగదీశ్వరి, బీజేపీ జిల్లా నాయకులు కాటన్‌పల్లి ఆంజనేయులు, రజక సంఘం మండల కార్యదర్శి చాకలి రాములు, నాగని వెంకట్రాములు, నీలకంఠ రజక సంఘం గ్రామ అధ్యక్షులు మోత్కూర్ లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి చాకలి వెంకటయ్య కార్యదర్శులు మోత్కూర్ భీమయ్య , యాదయ్య, ఇప్పాయిపల్లి గ్రామ అధ్యక్షులు చాకలి ఆంజనేయులు, బాలయ్య, టి గోపాల్ ,చాకలి భీమయ్య , చాకలి రాజు చాకలి తిరుపతి, చాకలి కుమార్ తదితరులు పాల్గొన్నారు.