నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిని కొనసాగించుటకు అందరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని, చాకలి ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆనాటి పాలకులు ఏ విధంగా ప్రజలను హింసించారో తన పోరాటం ద్వారా ప్రపంచానికి తెలిపిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కలక్టర్ తేలిపారు. ప్రత్యేకంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి గొప్ప చరిత్ర ఉందని. తెలంగాణ కోసం గొప్ప పోరాటాలు చేసిన వారిలో చాకలి ఐలమ్మ ఒకరని కలెక్టర్ తెలిపాు. గత పోరాట ఫలితాలే నేటి స్వాతంత్ర్య తెలంగాణ అని, వాటి బీజాలను నేటి వ్యక్తులు మర్చిపోతున్నారని, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చిన పొరటయోధులను గుర్తు పెట్టుకోవాలని కలేక్టర్ కోరారు. చదువుతోనే ప్రజలలో చైతన్యం కలుగుతుందని , స్థిరమైన ప్రణాళిక తీసుకొని అంధరూ కలిసి పరిష్కారం కోసం అన్వేషించాలి. సమాజంలో వెనుకబడిన వారికి సాయం అందించేందుకు ముందుకు రావాలని, సమాజంలో ఎన్నో అవకాశం వస్తుంటాయి వటిని సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాలని కలెక్టర్ సూచించారు. చాకలి ఐలమ్మ ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాడాలని, సమాజంలో మహిళలు ముందుకు వచ్చినప్పుడు అసలైన చైతన్య కలుగుతుందని కలేక్టర్ పేర్కోన్నారు.మహానుభావుల ఆశయాలు, ఆకాంక్షలు స్ఫూర్తిని కొనసాగించాలని కలక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి అనసూయ ,డిటిఓ రవికుమార్, డిడబ్ల్యూఓ నరసింహారావు, టీఎన్జీవో సెక్రరీ దున్న శ్యామ్, డి సి డి ఓ లత, డిఇఓ అశోక్ ,డిటిడిఓ శంకర్, చాకలి ఎస్సీ సాధన కమిటీ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ నాగయ్య,రజక ఉద్యోగుల సంగం రాష్ట్ర వైస్ ప్రసిడెంట్ ఎం.అచ్చయ్య,జిల్లా అధ్యక్షులు ఉపేందర్, రజిత ఉద్యోగుల జిల్లా వైస్ ప్రెసిడెంట్ జై సైదులు, చాకలి ఎస్సీ సాధన కమిటీ మహిళా నాయకురాల్లు ఏ పద్మ, సిహెచ్ యాక లక్ష్మి, కే నిర్మల, భి శైలజ,ప్రజాసంఘాలు,సిబ్బంది పాల్గొన్నారు.