– టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
– పట్నంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం యాచారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ నూతన విగ్రహ ఏర్పాటు సభా కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు, టీపీసీసీ క్యాంపనింగ్ కమిటీ సభ్యులు కొత్తకుర్మ శివకుమార్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఆనంద్, కొత్తకుర్మ మంగమ్మ, యాచారం మండలాధ్యక్షులు మస్కు నర్సింహా, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మంఖాల్ దాసు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.