వి.సి క్రియేషన్స్ బ్యానర్ పై సంజరురెడ్డి బంగారపు దర్శకత్వంలో కే.ఓ.రామరాజు నిర్మిస్తున్న చిత్రం ‘పద్మ వ్యూహంలో చక్రధారి’. ప్రవీణ్ రాజ్‌కుమార్ హీరోగా, శశికా టిక్కూ, అషురెడ్డి హీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకని రాయచోటిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మూవీ కాస్ట్ అండ్ క్రూతో పాటు జబర్దస్త్ నటీనటులు వినోదిని, పంచు ప్రసాద్, నాగిరెడ్డి, ఫణి, ఉప్పల్ బాలు, శాన్వి, సత్తి, రేలారే రేలా గోపాల్ పాల్గొన్నారు. వీరితో పాటు రాయచోటిలో ఉన్న ప్రముఖ డాక్టర్లు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ‘రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అలాగే తెలుగు ఇండిస్టీలో రాయచోటి నుంచి ఇద్దరు హీరోలు ఉన్నారు. యూత్‌ఫుల్ సినిమాలతో అలరించే కిరణ్ అబ్బవరం, అలాగే ఈ సినిమా హీరో ప్రవీణ్‌రాజ్‌కుమార్ కూడా ఇదే ప్రాంతం వాడు అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రవీణ్ రాజ్‌కుమార్ సైతం కిరణ్ అబ్బవరం అంత గొప్ప పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నాం’ అని ఈ వేడుకకు విచ్చేసిన డాక్టర్లు అన్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, ‘భిన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేడు (శుక్రవారం) విడుదలయ్యే మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ చూసి ఆదరించాలని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.