పద్మవ్యూహంలో చక్రధారి

పద్మవ్యూహంలో చక్రధారిప్రవీణ్‌ రాజ్‌ కుమార్‌ హీరోగా శశికాటిక్కో, ఆషు రెడ్డి కీలక పాత్రలలో సంజరురెడ్డి బంగారపు దర్శకత్వంలో ఓ యూనిక్‌ ప్యూర్‌ లవ్‌ ఎమోషనల్‌ డ్రామా రూపొందుతోంది. కె.ఓ.రామరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పద్మ వ్యూహంలో చక్రధారి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ పెట్టారు. ఈ సందర్భంగా టైటిల్‌ లాంచ్‌ ప్రెస్‌మీట్‌లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య, దర్శకుడు కష్ణ చైతన్య, ప్రవీణ్‌ రాజ్‌ కుమార్‌ తదితరులు చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. దర్శకుడు సంజరురెడ్డి బంగారపు మాట్లాడుతూ,’రాయలసీమ ప్రాంతం అంటే ఇన్నాళ్లు గొడవలు ఫ్యాక్షన్‌ ఇవే చూశారు. ఈప్రాంతంలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమని చూపించబోతున్నాం. గ్రామీణ నేపథ్యంలో జరిగే ఈ కథని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు. ‘ఇందులో సత్య అనే పాత్రలో కనిపిస్తాను’ అని శశికా చెప్పారు. ఆషు రెడ్డి మాట్లాడుతూ, ‘ఇందులో పద్మ అనే పాత్ర చేస్తున్నాను. చాలా భిన్నమైన పాత్ర ఇది’ అని తెలిపారు. ప్రవీణ్‌ రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఫస్ట్‌ లవ్‌ ఉంటుంది. కొందరు సక్సెస్‌ అవుతారు. కొందరు ఫెయిల్‌ అవుతారు. అయితే తన ఫస్ట్‌ లవ్‌ వద్దే ఆగిపోయిన ఓ వ్యక్తి అక్కడి నుంచి ఎలా బయటికి వచ్చాడనే పాత్రలో మధునందన్‌ కనిపిస్తారు. ఆ పాత్ర చాలా గుర్తుండిపోతుంది’ అని చెప్పారు.