
కాంగ్రెస్ పార్టీ లో చేరిన చలమల్ల కృష్ణారెడ్డి శనివారం చౌటుప్పల్ మండలం దామెర క్యాంప్ ఆఫీస్ లో తన అనుచర వర్గీయులతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తొలిసారిగా దామెర క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా చలమల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు.పార్టీ అధిష్టానం ఎవరికి ఏ బాధ్యత అప్పజెప్పిన వారితో పాటు కలిసి పని చయడానికి సిద్ధంగా ఉంటానని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని ఆయన చెప్పారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తా అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ పదవి ఇచ్చిన స్వీకరిస్తానని,పదవి ఇవ్వకపోయినా క్రియాశీల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని చలమల్ల కృష్ణారెడ్డి ఆయన అనుచర వర్గీయులలో భరోసానింపారు.త్వరలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలసి ఆయనతోపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చలమల్ల కృష్ణారెడ్డి చెప్పారు.ఈ కార్యక్రమంలో గూడూరు వెంకట్ రెడ్డి,నర్రి సత్తయ్య,సురివి నరసింహగౌడ్,బుట్టి సత్యనారాయణ,అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.