– రేవూరిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ధర్మారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..
నవతెలంగాణ – పరకాల
ఎంతో ప్రాముఖ్యం కలిగిన పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ఇసుక, మొరం దందాలు చేసి దోచుకుని, దాచుకున్న వ్యక్తే పరకాల మాజీ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి అని పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం రోజున పరకాల బస్టాండ్ కూడలిలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శవయాత్ర, దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏనాడు పరకాల అభివృద్ధిపై దృష్టి పెట్టని ధర్మారెడ్డి తన సొంత కాంట్రాక్టుల కోసం ప్రతి గ్రామంలో ఇసుక, మోరం దందా నడిపారని విమర్శించారు. పరకాల పట్టణంలో కనీసం మూడు దళిత కాలనీలను అభివృద్ధి చేయలేదని వాటికి సీసీ రోడ్లు, సైడ్ కాలువలు కూడా నిర్మించలేదని తెలిపారు. శిలాఫలకాల ధ్వంసం చేసే చరిత్ర ధర్మారెడ్డి దేనని అన్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన పరకాల పట్టణాన్ని జిల్లాల పునర్విభజన సమయంలో పరకాలను జిల్లా కేంద్రం చేయకుండా, ప్రజల వినతులను ఏమాత్రం పట్టించుకోకుండా జిల్లాల పునర్విభజన చేసే సమయంలో విహారయాత్రకు వెళ్లిన వ్యక్తి చల్లా ధర్మారెడ్డి అని అన్నారు. గత పది ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క వ్యక్తికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించే ఇవ్వలేదని తెలిపారు. పరకాలను వ్యాపార, వాణిజ్య పరంగా దెబ్బతీసిందే ధర్మారెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటుక్కురి దేవేందర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ అనిత రామకృష్ణ, కౌన్సిలర్లు పంచగిరి జయ్యమ్మ,బండి రాణి సదానందం,మార్క ఉమ రఘుపతి,నల్లెళ్ల జ్యోతి అనిల్,పసుల లావణ్య రమేష్, మడికొండ సంపత్,కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ఒంటర్ రామ్మూర్తి, చందుపట్ల రాఘవరెడ్డి,చిన్నల గొనాద్, దార్న వేణుగోపాల్,ఒంటెరు, శ్రవణ్, పబ్బ శ్రీనివాస్,మెరుగు శ్రీశైలం,దుబాసి వెంకట స్వామి, ఎండి జాఫర్ రిజివి,ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి,బుర్ర రాజమౌళి, పోరండ్ల వేణు,గడ్డం శివ,లక్కం వసంత శంకర్,దాసరి భిక్షపతి, మంద నాగరాజు,ఎండి అలీ,బండారి కృష్ణ,వెలదండి సురేష్,అల్లం రఘునారాయణ, నలబోల కృష్ణయ్య,ఇనుగాల రమేష్,పసుల విజయ,భద్రయ్య, కోమల,షఫీ,మచ్చ సుమన్,ఆలేటి రాజు,బొచ్చు బాబు,గోవిందా సురేష్,బొచ్చు రవి,గొట్టే రమేష్,ఉడుత సంపత్ కుంకుమేశ్వర అలయకమిటి చైర్మన్ కొలుగురి రాజేశ్వరరావు, ఎస్సి సెల్ అధ్యక్షుడు బొమ్మకంటి చంద్రమోళి,బూత్ కమిటీ సభ్యులు, వార్డ్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.