భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన బీఎస్పీ అభ్యర్థి చల్ల నారాయణరెడ్డి

నవతెలంగాణ- కాటారం : మంథని నియోజకవర్గ బిఎస్పి పార్టీ అభ్యర్థి చల్ల నారాయణరెడ్డి గురువారం నామినేషన్ వేయడానికి  బీఎస్పీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అంబేద్కర్ సెంటర్ నుండి మంథని ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం చల్ల నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో మంథని నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగురవేద్దామని పేర్కొన్నారు. బహుజన వాదం అని జనాలను మభ్యపెట్టి ఈ ప్రాంత నాయకులు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల బాగు చేసిన నాయకుడు ఎవ్వరు లేరని తెలిపారు. మంథని నియోజక వర్గంలో బహుజన రాజ్యాన్ని తీసుకువచ్చి, దొంగల రాజ్యాన్ని ప్రాలాదోలుదాం అని అన్నారు. హత్యలు చేసే నాయకులను, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే అని మంథని నియోజక వర్గం నుండి తరిమికొడుదామని తెలిపారు.