నవతెలంగాణ-మల్హర్ రావు : బీఎస్పీ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్లా నారాయణరెడ్డి నామినేషన్ వేయడానికి వెళుతున్న క్రమంలో గురువారం కొందరు వ్యక్తులు కత్తులతో దాడికి యత్నించగా వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా చల్లా మాట్లాడారు జన సంద్రోహన్ని చూసి ఓర్వలేక తనపై కత్తులతో దాడి చేయించడానికి కొందరు మంథని పెద్ద నాయకులు ఇంత చిల్లర హత్య రాజకీయాలకు తెర లేపారని ఆరోపించారు.మంథని నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యిందని, ప్రజలారా. అలోచించి ఓటు వేయాలని వేడుకొన్నారు.