నేటితో ముగియనున్న ఛలాన్ల డిస్కౌంట్‌ చెల్లింపులు

– మోమిన్‌పేట్‌ సీఐ ఆర్కపల్లి ఆంజనేయులు
నవతెలంగాణ-మర్పల్లి
పెండింగ్‌ ఛలాన్ల చెల్లింపును వాహనదారులకు ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్‌ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని మోమిన్‌పేట్‌ సీఐ అర్కపల్లి ఆంజ నేయులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలను నడిపిన వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం వాహనాలపై ఉన్నటువంటి పెండింగ్‌ ఛలాన్ల రాయితీ(డిస్కౌంట్‌) ఇచ్చింది. ఆఫర్‌ టూవీలర్‌ పై 80శాతం, త్రీవీలర్స్‌ పై 90శాతం, ఫోర్‌ వీలర్‌ పై 60 శాతం,హెవీ వెహికల్స్‌ పై 50శాతం డిస్కౌం ట్‌ ఇచ్చింది. వాహనాలపై ఉ న్నటు వంటి పెం డింగ్‌ ఛలాన్ల ను వెంటనే దగ్గరలో ఉన్న మీ సేవలో కానీ లేదా మీ ఫోన్లో ఉన్న పేటీ ఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా 10వ తేదీ మంగళవారం సాయంత్రం లోపు చెల్లించాలని ఆయన తెలిపారు.