
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఈ నెల 10న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ” గ్రామీణ ఉపాధి చట్టము అమలు- సవాళ్లు”అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. శనివారం బొమ్మలరామారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో కలసి సదస్సు జయప్రదం కోరుతూ కరపత్రమును ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ..రూ. పేరుకే 300 కూలీ కానీ కార్మికులకు మాత్రము రూ.150 రూపాయలు దాటడం లేదని రూ.150 రూపాయలతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకుంటారని నర్సింహ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొలతలు లేని చట్టంలో కొలతలు పెట్టి కూలీల శ్రమను దోచుకుంటున్నారని అన్నారు.
ఇప్పటికైనా కొలతలు రద్దు చేయాలని రోజు కూలి రూ.600 ఇవ్వాలని పని దినాలు 200 రోజులు పెంచాలని నర్సింహ ప్రభుత్వాన్ని కొరారు. గతంలో పని ప్రదేశంలో మౌలిక వసతులు ఉండేది కానీ నేను బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ ఎత్తివేయడం వల్ల కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. పని చేస్తే వారం వారం డబ్బులు చెల్లించడం లేదని, కూలి రోజుకు ఎంత వస్తుందో తెలవడం లేదని ప్లే సిప్ల్ ఇచ్చే పరిస్థితి లేదని దీనితో కార్మికుల డబ్బులు ఎన్ని వస్తున్నాయి ఎప్పుడు వస్తాయో తెలవని పరిస్థితులలో ఉన్నారని అన్నారు.పని ప్రదేశంలో కార్మికులకు ప్రమాదం జరుగుతె ప్రభుత్వం అందుకోవడం లేదని అన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, చట్ట పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర సదస్సులో కూలీలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సల్లురి కుమార్, ఉపాధి హామీ కార్మికులు గుండ అంజమ్మ , రాగీరు నీలమ్మ , గాదె కృష్ణలీల, కోమరాజు లక్ష్మి , మారగోని శోభ, ఊట్ల మాధవి, మోట లక్ష్మి, రాచకొండ యాదమ్మ, ఊట్ల శిరీష, పహిళ్ల మంజుల, గుండ జంగయ్య, గాదె కొండల్, కోమరాజు రామచంద్రం పాల్గొన్నారు.