కెవిపిఎస్ అధ్వర్యంలో చల్లో ఢిల్లీ 

– కె వి పి ఎస్ జిల్లా సెక్రెటరీ కొండ గంగాధర్

నవతెలంగాణ- కంటేశ్వర్: కెవిపిఎస్ ఆధ్వర్యంలో చెలియా ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు కేవీపీఎస్ జిల్లా సెక్రెటరీ కొండ గంగాధర్ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా లోని కెవిపిస్ భవనం లో మల్యాల సుమన్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో జిల్లా కెవిపిస్ సెక్రటరీ కొండ గంగాధర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో రెండవసారి అధికారంలోకి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్టడుగు వర్గాలుగా ఉన్న దళితులు గిరిజనులు మహిళలు ఇతర పేదలపై జరుగుతున్న దాడులను హత్యలను అత్యాచారాలను అరికట్టాలని రాజ్యాంగ హక్కులు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి అందించడానికి జరిగే సంతకాల సేకరణ జయంప్రదం చేయాలని అఖిలభారత కమిటీల పిలుపు భాగంగా కోటి సంతకాల రాష్ట్రపతికి ఇవ్వడానికి డిసెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు దీనిని సామాజిక ఉద్యమకారులు ప్రగతిశీల కాముకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాను. డిమాండ్లు, జనాభా తమాషా ఆధారంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి నిధులు కేటాయించాలని వారి అభ్యున్నతికి ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి, భూమిలేని దళిత కుటుంబాలను. గుర్తించాలి ప్రభుత్వ భూములను పంచాలి మూడెకరాల పంపిణీ పథకాన్ని కొనసాగించాలి కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను అమలు చేయాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలకు చట్టం తేవాలి ప్రైవేట్ విద్యా వైద్య సంస్థలను ఫీజులు నియంత్రలకు ప్రత్యేక చట్టాలను చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలిప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లు రిజర్వేషన్ అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు నలువల నర్సయ్య, దేవుడుగాల్ల శంకర్ తదతరులు పాల్గొన్నారు.