వేములవాడ అర్బన్ మండలం కోడి ముంజ గ్రామంలోని రామప్ప జాతరకు బుధవారం వేములవాడ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరయ్యారు. ముందుగా రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రుద్రవరం మాజీ ఉపసర్పంచ్ తాడేం శ్రీనివాస్ ఇంటిలో నిర్వహించిన మల్లన్న పట్నాలకు హాజరయ్యారు. వారి వెంట అర్బన్ మండల ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు.