
– కోడెల పోషణను విస్మరించి రైతులకు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు..
– 1734 కోడెలపై ఆది శ్రీనివాస్ స్పందించాలి..
– ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే ఆలయ ఈవో పిర్యాదు చేయలేదా..?
నవతెలంగాణ – వేములవాడ: వేములవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ సోమవారం చల్మెడ లక్ష్మీనరసింహారావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి లు ఎంతో మంది వచ్చిన గతంలో ఈ అనవాయితీ లేదు..కాంగ్రెస్ సభకు ఉపయోగించిన 2కోట్లను ప్రభుత్వం అధికారులు రికవరీ చేయాలి రాజన్న సొమ్మును సభకు ఉపయోగించిన అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. భోజనం 2 కోట్లు ఎటు పోయాయి..? భక్తితో భక్తులు వేసిన డబ్బులు ఎవరి జేబులు చేరాయి..? అని ప్రశ్నించారు. ఇంత ఖరీదైన భోజనాలు ఏర్పాటు చేయడంలో అధికారుల అంతరార్థం ఏంటని నిలదీశారు. ప్రభుత్వం ఈ డబ్బులను వెంటనే రికవరీ చేయాలి లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాజన్న కోడెలను కబేలాలకు తరలించడం చాలా బాధాకరం,కోడెల విషయంలో భక్తుల, ప్రజల మనోభావాలు దెబ్బతీశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న ఆలయంలో ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే స్పందించడం లేదు ఎందుకో…? చెప్పాలని అన్నారు. దేశంలో ఎక్కడ లేని ఆనవాయితీ రాజన్న సన్నిధిలో ఉంది..శివునికి అత్యంత ప్రీతికరమైన వాహనం నంది వాహనం, భక్తుల కోరికలు తీర్చుకునే ప్రక్రియలో కోడెను కట్టడం ఆనవాయితీ.. దేశంలో ఎక్కడ ఈ ఆనవాయితీ లేదు ఒక రాజన్న క్షేత్రంలోని ఉందని అన్నారు.భక్తుల మనోభావాలను దెబ్బతీసే కాంగ్రెస్ నాయకులు విషయంపై స్పందించాలి,రాజన్న ఆలయానికి ఏటా రూ. 119 కోట్లు వస్తే 22కోట్ల కోడే కోడెముక్కల రూపంలో రాజన్న ఖజానాకు జమవుతున్నాయని ఇంత ఆదాయం వస్తున్న రాజన్న కోడెలకు సరైన రక్షణ లేకపోవడం శోచనీయమని అన్నారు.
ఆదాయంలో కేవలం రూ. 2కోట్లు మాత్రమే పోషణకు కోడెలకు కేటాయిస్తున్నారు.కోడెల పోషణను విస్మరించి రైతులకు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు..మే నెలలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేసి ఈ.వో కన్వీనర్ గా జూన్ లో కోడెలను పంపిణీ, కోడెలు పంపిణీలో పారదర్శకతలేదని మండిపడ్డారు.ఒక్కో రైతుకు రెండు కోడెలను పంపిణీ చేసి నియమ నిబంధనలు పెట్టారు, ఆ నిభందనలు బాగున్నా ఆచారనలో ఎందుకు పెట్టలేదో చెప్పాలి. గీసుకొండ పోలీస్ స్టేషన్ లో 33మంది రైతుల పేరుతో 66 కోడెలను ముగ్గురికి కేటాయించారు.విశ్వహిందూ పరిషత్ నాయకుల పిర్యాదు మేరకు మదాసి రాంబాబు తో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపింది నిజం కాదా అని అన్నారు.28కోడెలు కబేలాలకు అమ్మడం చాలా బాధాకరం 66 కోడెలను శ్రీ రాజరాజేశ్వర సొసైటీ కేటాయిస్తే అందులో 26కోడెలను తిరిగి రాజన్న గోశాలకు తీసుకువచ్చారనే విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు అని వెల్లడించారు. మరి నిబంధనలు ఎందుకు పెట్టుకున్నారు, ఇంత జరిగినా వివిధ హోదాల్లో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ.ఓ, మంత్రి మాటల్లో 1734 కోడెలను రైతులకు ఇచ్చామని, వాటిపై విచారణ జరిపేలా పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తామని చెప్పిన ఈ.వో ఎందుకు పిర్యాదు చేయలేదని అన్నారు.ఈ పరిణామం ఇది ఎన్నో అనుమానాలకు తావిస్తుంది, స్థానిక ఎంఎల్ఏ ఒత్తిడి వల్లే ఇవ్వలేదా అని అడుగుతున్నాను. చిటికిమాటికి స్పందించే ఎంఎల్ఏ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు యాక్షన్ తీసుకోవడం లేదు.కోడెల ఇష్యూ పట్ల ఎందుకు విచారణ చేస్తలేరని ప్రశిస్తున్నాం.
రాజన్న భక్తుడిగా ఉన్న స్థానిక ఎంఎల్ఏ ఎందుకు స్పందించడం లేదు..?
ఈ నెల 7వ తేదీన తప్పుడు వార్త అని మంత్రి సురేఖ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది,సంతకాలు పోర్జరీ చేసిన ఎందుకు విచారణ చేస్తాలేరు. ఇందులో మీ పాత్ర కూడా వుందా అని ప్రశిస్తున్నాం అని అన్నారు. ఆలయ పాలనపై అదికి ఎంతో అనుభవం వుంది, మరి బాధ్యతగా గోవులను పోషించాలని ఎందుకు అనుకోవడం లేదు.తూతూమంత్రంగా కమిటీ వేసి మమ అనిపించారు తప్పితే ఒరిగిందేమీ లేదు అని నిలదీశారు. కోడెల ఇష్యూపై వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఎందుకు పిర్యాదు చేయలేదని అడుగుతున్నాం, స్థానిక ఎంఎల్ఏ ఒత్తిడి మేరకే ఆలయ ఈ.వో పిర్యాదు చేయలేదా..? ఆలోచన చేయాలి భక్తుల విశ్వాసంతో ముడిపడి వున్న అంశం నేపథ్యంలో ఇప్పటికైనా కోడెలకు ప్రణాళిక బద్దంగా ఎలా పోషిస్తారు అనే అంశాన్ని తెలియజేలసిన అవసరం ఉంది,1734 కోడెలపై ఆది శ్రీనివాస్ స్పందించి విచారణకు ఆదేశించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన కోరారు.రాజన్న ఆలయ పాలనకు 14మంది సూపరిడెంట్లు ఉండాలి…వేలాది మంది భక్తులు వస్తే ఇక్కడికి సంపూర్ణమైన సేవలు భక్తులకు ఎందుకు అందివ్వడం లేదు..ఆదికి ఫొటోలు దిగడంలో వున్న శ్రద్ధ ఆలయ పాలనలో, పనుల ఆచరణలో లేదని అన్నారు.ఇప్పటికే ఒత్తిడికి తట్టుకోలేక ఈ.వో సెలవుల్లో వెళ్ళిపోయారు,ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా సీఎం కార్యక్రమంలో బోజనాలకు 17లక్షలు కేటాయించారు,32వేల రూపాయలు ఒక్కో ప్లేటుకు ఖర్చు చేశారు,ఇది సిగ్గు చేటు…దీనిపై ఎంఎల్ఏ స్పందించాలిని తెలిపారు.ఆలయ అభివృద్ధికి 72కోట్లు తెచ్చిన అని చెబుతున్నారు..ఒక్క రూపాయి అయిన డిపాజిట్ అయిందా అని అడుగుతున్నా.డి.పి.ఆర్ ప్రకారం ఆలయం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు, మరి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై ప్రజలకు వివరించాలని కోరుతున్నాం.
స్థానిక ఎమ్మెల్యే మాటిమాటికీ ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం కాదు, దేవాలయంలో జరుగుతున్న వ్యవహారాలు పైన స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి కౌన్సిలర్లు నిమ్మచెట్టి విజయ్, గోలి మహేష్, నరాల శేఖర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ తీగల రవీందర్ గౌడ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, కందల క్రాంతి కుమార్, పొలాస నరేందర్, లిక్కిడి మహేందర్ రాంబాబు తో పాటు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు.