చల్మెడ పరామర్శ..

నవతెలంగాణ – వేములవాడ రూరల్ : వేములవాడ రూరల్ మండలంలోని మల్లారం ఎంపిటిసి తిరుపతి మాతృమూర్తి నరసవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు, హన్మాజీపేట గ్రామానికి చెందిన ఎల్లల తిరుపతిరెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్మెడ లక్ష్మీనరసింహారావు వారి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన వెంట సీనియర్ నాయకులు గడ్డం హనుమాన్లు, మండల అధ్యక్షులు,  గుస్కుల రవి, కౌన్సిలర్లు నిమ్మచెట్టు విజయ్,మాజీ సర్పంచులు పండుగ తిరుపతి, నాయకులు వెంగల శ్రీకాంత్ గౌడ్, పిట్టల వెంకటేష్, అంజి, నవీన్, దేవరాజ్ ,దేవయ్య, సందీప్, సాయి తో పాటు తదితరులు ఉన్నారు.