
వేములవాడ అర్బన్ మండలం సంకపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండారి శ్రీనివాస్ సోదరులు బండారి అంజయ్య (50) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు గురువారం సంకెపల్లి గ్రామానికి చేరుకొని అంజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. వారి వెంట అర్బన్ జడ్పిటిసి మ్యాకల రవి, మండల సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, మాజీ వైస్ ఎంపీపీ ఆర్ సి రావు, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రావు, బుర బాబు, కనకరాజు, రాము గౌడ్, శ్రీధర్, అరుణ్, అంజి, బుచ్చి బాబు, తదితరులు ఉన్నారు.