కౌన్సిలర్ ఇంట్లో తేనేటి విందు స్వీకరించిన చల్మెడ

నవతెలంగాణ-వేములవాడ 
వేములవాడ పట్టణంలోని 25 వ వార్డు కౌన్సిలర్ గూడూరి లక్ష్మి, ఆమె కుమారుడు  మధులను సోమవారం బి.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు  చల్మెడ లక్ష్మి నరసింహరావు  మర్యాదపూర్వకంగా కలిశాడు.   గురు పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని మార్కండేయనగర్  సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించుకుని వస్తున్న చల్మెడ లక్ష్మి నరసింహరావుకు  గూడూరు మధు అనుకోకుండా కలిశారు.  ఈ క్రమంలో  బాగున్నావా మధు అంటూ చల్మెడ ఆప్యాయంగా  పలకరించాడు. అనంతరం మధు ఇంట్లో తేనేటి విందు స్వీకరించి, పార్టీ బలోపేతం వంటి పలు అంశాలపై చర్చించారు. వారి వెంట కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, నాయకులు సుంకపాక రాజు తదితరులు ఉన్నారు.