చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై ఛలో కలెక్టరేట్

నవతెలంగాణ-చేర్యాల : చారిత్రకంగా,రాజకీయంగా అన్ని అర్హతలున్న సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చేర్యాల అంగడి బజారులోని అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి బైక్ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వరకు బయలుదేరారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరికైన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకై గత నాలుగు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని,ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చేర్యాల ను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.