
నవతెలంగాణ -కంటేశ్వర్
జిపి ఉద్యోగ, కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని జూలై 6 నుండి సమ్మె కొనసాగుతుందని రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు 2023 జూలై 21న ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆఫీసులో జిల్లా జేఏసీ నాయకులు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ దాసు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సుధాకర్ లు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలో 50వేల మంది పనిచేస్తున్నారని వీళ్ళందరికీ వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని, ప్రమాద బీమా 10 లక్షలు, సాధారణ భీమా ఐదు లక్షల బీమా పోస్ట్ ఆఫీస్ లో కట్టాలని, పిఎఫ్ ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను అమలు చేయమని రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్మికుల బాధని అర్థం చేసుకోకుండా, ఎవరో రాజకీయ నాయకులు రచ్చగొడితే సమ్మె చేస్తున్నట్లు వాక్యానించడం సబబు కాదని ఆయన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కార్మికులందరికీ సంవత్సరానికి మూడు జతల బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనెలు సరిపోయే పరికరాలను ఇవ్వాలని, రాష్ట్ర జేఏసీ పెట్టిన 17 డిమాండ్లను పరిష్కరించాలని వారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోరారు. స్వచ్ఛ తెలంగాణలో ముందు బాగాన నిలిచి తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి పని చేస్తున్న సఫాయి కార్మికుల పట్ల వివక్షత నిర్లక్ష్యం తగదని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది కార్మికుల కృషి వల్లనే కేంద్రం ప్రభుత్వం అవార్డులు ఇచ్చిన విషయం గుర్తురగాలని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్లకు పదోన్నతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి జెపి గంగాధర్, సీఐటీయూ జంగం గంగాధర్,
ఐఎఫ్ టియు నాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.