ప్రజా సమస్యల పరిష్కారానికి జూలై 24న ఛలో కలెక్టరేట్..

– బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బని లత 
నవతెలంగాణ -కంటేశ్వర్
ప్రజా సమస్యలు పరిష్కారించాలని కోరుతూ బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి జిల్లా కమిటి ఆధ్వర్యంలో జూలై 24న ఉదయం 11 గుంటలకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని బిఎల్ పి రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బని లత జిల్లా కన్వీనర్ కె. మధు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిఎల్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రజా సమస్యలపై రూపొందించిన కరపత్రాన్ని వారు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఆరోపించారు.ఉమ్మడి రాష్ట్రంలో నిరుపేదలు వేసుకున్న చిన్న చిన్న గుడిసెలకు ఇంత వరకు పట్టాలు మంజూరు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి డబుల్ బెడ్ రూం కోసం నిరుపేదలు అనేక ఉద్యమాలు నిర్వహించిన ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేకుండా పోయిందని వెల్లడించారు.అదేవిధంగా గతంలో వామపక్ష ,విప్లవప్రజా ఉద్యమాల ఒత్తిడికి తలొగ్గి ,పేద ,మధ్యతరగతి ప్రజలకు పంపిణీ చేసిన రెండు మూడు ఎకరాల భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం ధోరణి పోర్టల్ పేరుతో ప్రజలనుండి లాక్కుంటున్నదని విమర్శించారు. అదే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో బిసిల సంక్షేమ కోసం బిసి కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేసేవి గత ప్రభుత్వాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత బిసి సంక్షేమ పథకాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ లకు తగిన నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు.దళిత బంధు, లక్ష రూపాయల బిసి లోన్ కేవలం ఎన్నికల జిమ్మిక్కులో భాగమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిజంగా బహుజన కులాలపై సంక్షేమ కోసం కాదని చెప్పడానికి తొమ్మిది సంవత్సరాలుగా వాటి ఊసెత్తకపోవడమే అని చెప్పకతప్పదు. ఈ  డిమాండ్ల సాధన కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వ స్థలాల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవిస్తున్న ప్రజలకు పట్టాలు మంజూరు చేయాలిగృహ లక్ష్మి దరఖాస్తుల స్వీకరణకు వెంటనే తసీల్దాహర్ లకు ఆదేశాలు జారీ చేయాలి. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి. రేషన్ కార్డుల్లో తొలగించిన గల్ఫ్ వలస కార్మికుల పేర్లను వెంటనే పొందుపర్చాలి.కొత్త వితంతు,వంటరి మహిళా పెన్షన్లు మంజూరు చేయాలి.బిసి కులాల కార్పొరేషన్ లకు నిధులు మంజూరు చేయాలి ధరణి పోర్టల్ తో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కారించాలి.గత ప్రభుత్వాలు నిర్మించి ఇచ్చిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి వాటికి తక్షణమే 5 లక్షల రూపాయల రుణాలు మంజూరు చేయాలి. ఈ సమావేశంలో జిల్లా నాయకులు దండు జ్యోతి, బ్రాహ్మణపల్లి జగదీష్ , ఆకుల సుజాత పాల్గొన్నారు.