21న ఛలో ఢిల్లీ కార్యక్రమం

నవతెలంగాణ-కరీంనగర్‌: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య నాయకత్వంలో ఈనెల 21న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం తెలిపారు. యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం పటేల్‌ హాజరై, సంఘం కార్యాలయంలో ఛలో ఢిల్లీ పోస్టర్‌ ఆవిష్కరణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆది మల్లేశం పటేల్‌, నర్సింగోజు శ్రీనివాస్‌ చారి లు మాట్లాడుతూ..ఈనెల 21న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో పార్లమెంట్‌ వద్ద మహాధర్నా కార్యక్రమం వివిధ కేంద్ర మంత్రులను కలిసి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గాండ్ల రమేష్‌ పటేల్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పయ్యావుల మహేష్‌, యువజన సంఘం నగర ఉపాధ్యక్షులు రావుల రాజు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.