సమస్యల సాధనకై చలో ఢిల్లీ 

నవతెలంగాణ-రామారెడ్డి 
భారతీయ జీవిత బీమా లో ఏప్రిల్ 1 నుండి ఐఆర్డిఏ తీసుకొస్తున్న మార్పులతో ఎల్ఐసి ఏజెంట్ మనుగడ కష్టంగా ఉంటుందని లియఫి జాతీయ నాయకులు కిషోర్ చంద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి ఏటీసీ హాల్లో ఏజెంట్ల సమైక్య సమావేశాన్ని శుక్రవారం బ్రాంచ్ అధ్యక్షులు కదం నారాయణరావు అధ్యక్షతన నిర్వహించారు. ఐఆర్డిఏ తీసుకుంటున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఏజెంట్ల జేఏసీ ఆధ్వర్యంలో మార్చు 19వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న ఏజెంట్లు ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఏజెంట్ పాల్గొని ఏజెంట్ల సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కొండ బైరయ్య, ఉమాపతి, ప్రదీప్ జైన్, రామ్ శెట్టి శేఖర్, యాదవ రెడ్డి, శ్యామ్ రావు, సంతోష్, తదితరులు ఉన్నారు.