ఎస్సీ వర్గీకరణ సాధనకోసం ఛలో ఢిల్లీకి తరలి రావాలి

Chalo has to move to Delhi to practice SC classification– ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు బి ఎన్ రమేష్ కుమార్ పిలుపు 
– నిజామాబాద్ లో కరపత్రాల ఆవిష్కరణ
నవతెలంగాణ – కంటేశ్వర్
గత ముప్పై ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సాధనకోసం ఆగస్టు 10 వ తేదీన ఢిల్లీ లోని జంతర్మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన నిరసన ధర్నా కార్యక్రమానికి మాదిగలు, ఉప కులస్తులందరు అధిక సంఖ్యలో తరలి రావాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు బి ఎన్ రమేష్ కుమార్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా చలో ఢిల్లీ కార్యక్రమం కు సంబంధించిన కరపత్రాలను ఆయన నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధన తోనే మాదిగలకు, వాటి ఉపకులస్తుల వారికి అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని బీజేపీ అగ్ర నేతలు ఇచ్చిన నా టి హామీలు ఇప్పటికీ నీటి మూటలు గానే మిగిలయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10, 11 తేదీల్లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి పెద్ద యెత్తున మాదిగలు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా నూతన కమిటీని నియమించారు.  ఉమ్మడి జిల్లాల ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి గంధమాల నాగభూషణం మాదిగ, నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడుగా డల్లా సురేష్ మాదిగ,  ప్రధాన కార్యదర్శిగా నక్క రాజేందర్ మాదిగ, ప్రచార కార్యదర్శిగా సిద్దాపూర్ గంగాధర్ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధిగా సంగెం కిష్టయ్య మాదిగ, ఎమ్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడుగా మల్లాని శివ మాదిగ, మాదిగ యువ సేన జిల్లా అధ్యక్షుడు గా మట్టపు దీపక్ మాదిగ, నిజామాబాద్ నగర ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి గా ఓ మల్ల శ్రీనివాస్, కో ఇన్చార్జి గా ఆర్సపల్లి సుమన్, కార్యవర్గ సభ్యులుగా సుభాస్, రమేష్, గణేష్, నియమకమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు తాటి కాయల చిరంజీవి , ఉపాధ్యక్షుడు భాగయ్య, కామారెడ్డి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చిట్యాల సాయన్న మాదిగ, మహిళా నాయకురాలు సుధా మాదిగ, సావిత్రి మాదిగ, తిరుపతి, అజయ్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.