నవంబర్ 5న చలో హైదరాబాద్ మాదిగల యుద్ధభేరి బహిరంగ సభ

నవతెలంగాణ : అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు 23 సీట్లను కేటాయించాలి. మాదిగల డిక్లరేషన్ ప్రకటించాలి. అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఈ అసెంబ్లీ ఎన్నికలలో 23 సీట్లు కేటాయించాలని MSF రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి వెంకటేష్  మాదిగ డిమాండ్ చేశారు సీట్ల కేటాయింపు విషయంలో కెసిఆర్ గారు మాదిగలకు ప్రాధాన్యతనిస్తూ పునరాలోచించాలని డిమాండ్ చేశారు, నవంబర్ 5 న జరిగే మాదిగల యుద్ధ బేరి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాదిగ మాదిగ ఉపక్రలకు పిలుపునిచ్చారు.   బుధవారం  యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ  కేంద్రంలో ఎమ్మార్పీఎస్  ఆలేరు మండల అధ్యక్షులు గ్యాదపాక  మల్లేష్ ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ జరిగింది   నవంబర్ 5న ఇందిరా పార్కు హైదరాబాద్ జరిగే మాదిగల యుద్ధభేరి భారీ బహిరంగ సభ కరపత్రాన్ని MSF రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరు వెంకటేష్ ఆవిష్కరించారు.  ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెస్ ఎఫ్  రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరు వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ముందుండి కొట్లాడిన మాదిగలకు  అన్ని రాజకీయ పార్టీలు మోసపూరిత ధోరణి అవలంబిస్తున్నాయని, జనాభా ప్రాతిపదికన ఈ రాష్ట్రంలో 70 లక్షలకు పైగా ఉన్న మాదిగలకు 23 సీట్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. 1శాతం ఉన్నటువంటి వారికి 6సీట్లను, 7 శాతం ఉన్నటువంటి వారికి 40 సీట్లను కేటాయిస్తున్నటువంటి అగ్రకుల పార్టీలు మాదిగలను విస్మరిస్తే తగిన గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు. అధికార దాహమే లక్ష్యంగా పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలను ఎమ్మార్పీఎస్ పక్షాన రాబోయే ఎన్నికల్లో ఎదుర్కొని మాదిగలను మాదిగ ప్రతినిధులను అగ్రభాగాన  నిలిపేందుకు ఎంఆర్పిఎస్ కృషి చేస్తుందని వారు తెలిపారు. ఇందులో భాగంగానే ఇందిరా పార్క్ హైదరాబాదులో నవంబర్ 5వ తేదీన జరిగే మాదిగల  యుద్ధభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని మాదిగలకు పిలుపునిచ్చారు.  మాదిగలు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలంటే అన్ని పార్టీలు మాదిగ డిక్లరేషన్  ప్రకటించాలని డిమాండ్ చేశారు.  బీజేపీ అధికారంలోకి వస్తే  100 రోజుల్లో  ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చింది కానీ అధికారులకు వచ్చిన తర్వాత మాదిగలను మోసం చేసిందని అన్నారు  బీజేపీ పార్టీకి మాదిగలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు,  దళిత బంధు బీఆర్ఎస్ బందుగా మారిందని అన్నారు.  ప్రతి నియోజకవర్గంలో  దళితులకు ప్రతి కుటుంబానికి దళిత బందు ఇవ్వాలని దళిత బందులో మాదిగల వాట ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అణగారిన  వర్గాల విద్య అభివృద్ధి కోసం  సాంఘిక సంక్షేమ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు తాము అదికాలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవి మాదిగలకు ఇస్తామని హామి ఇవ్వాలి. ఒక రాజ్యసభ, ఒక  MLC మాదిగలకు ఇవ్వాలి,
రెండుMP స్థానాలు మాదిగలకు ఇవ్వాలి డిమాండ్ చేశారు,  కార్యక్రమంలో రామచర్ల సిద్ధులు బోడ నరేష్ కాంతి బాలరాజు గ్యదాపాక కిష్టయ్య వంగపల్లి సురేష్, రాజు, యాదగిరి, సుధాకర్,  వినయ్, మధు, సంతోష్, నరేష్ పవన్ వీరేందర్ వీరేష్ అజయ్ ఆంజనేయులు శివ తదితరులు పాల్గొన్నారు.