నవతెలంగాణ – ఆర్మూర్
సెప్టెంబర్ 30నచలో హైదరాబాద్ జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాస్ కోరారు. నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో గురువారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోడ్లను మూడు క్రిమినల్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, బీడీ కార్మికులకు రూ.4000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని, కోరారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్లతో ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30 తేదీన భారీ ప్రదర్శన ధర్నాను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్, జిపి నాయకులు చిన్నగంగాధర్, జిపిమరియు ఆటో కార్మికులు బాజన్న, చాంద్ పాషా , మైనుద్దీన్ ,ఖాసీం ,గంగారాం, భాష తదితరులు పాల్గొన్నారు.