నవతెలంగాణ – పెద్దవంగర
లక్ష డబ్బులు, వేల గొంతుకలు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7న జరిగే ఛలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలని ప్రోగ్రాం స్టేట్ కోఆర్డినేటర్ యాసారపు రాంబాబు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో లక్ష డబ్బులు, వేల గొంతుకలు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ఆశయం నెరవేర్చుటకు మాదిగ ఉప కులాలు మాదిగలు ఐక్యమత్యంగా వెలిగి లక్ష డబ్బులు వేయి గొంతులు కార్యక్రమానికి మాదిగలు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు ఈదురు యాకయ్య మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐలయ్య, సోమారపు ఐలయ్య మాదిగ , రావిచెట్టు ఉపేందర్ మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ధర్మారపు నాగన్న, గద్దల శ్రీకాంత్ మాదిగ, గణపురం అనిల్ మాదిగ, చిలక బిక్షపతి మాదిగ, మోహన్ మాదిగ, గోపి కుమార్ మాదిగ, దంతాలపల్లి జనార్ధన్ మాదిగ, బబ్బులు, శ్రీకాంత్, జలగం శ్రీను, జలగం మొహమ్మద్, సైదులు, వెంకన్న మాదిగ, పరుశురాం, సుంకరి ఎల్లయ్య మాదిగ, తదితరులు పాల్గొన్నారు.