ఫిబ్రవరి 7న ఛలో హైదరాబాద్..

Chalo Hyderabad on February 7.– వేల గొంతులు లక్షల డప్పులు మహా సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చెయ్యాలి
– మాదిగ ఉద్యోగుల సంఘము నిజామాబాదు ఆధ్వర్యంలో  కరపత్రాలు, గోడ ప్రతులు ఆవిష్కరణ
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
వేల గొంతులు లక్షల డప్పులు మహా సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చెయ్యాలి అని ఎం ఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలమల సురేష్ మాదిగ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో వేల గొంతులు లక్షల డప్పులు గోడ పత్రాలు, కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలమల సురేష్ మాదిగ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 7న జరిగే వేల గొంతులు లక్షల డప్పులు మహా ప్రదర్శనను నిజామాబాదు జిల్లా కేంద్రం నుంచి వేలాదిగా డప్పులుతో బయలుదేరి విజయవంతం చెయ్యాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే ప్రతి గోడ పత్రిక జిల్లా లో ఉన్నా ప్రతి గ్రామానికి చేరాలా చూడాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ప్రతి మాదిగఉద్యోగి ఇంటికి కరపత్రం చేరేలా చూడాలని పిలుపునివ్వడం జరిగింది. ప్రతి మాదిగ ఉద్యోగి లక్ష డబ్బులు వేల గొంతుల సభకు డప్పుతో బయలుదేరాలని పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్  రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్, ఎం ఈ ఎఫ్  జిల్లా కన్వినర్ మారుతీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, మాదిగ ఉద్యోగుల సీనియర్ నాయకులు మహేష్ కుమార్, సిద్దిరాములు, గంగాధర్, సాయిలు,సీతయ్య,రాములు, సహాదేవ్, సాయి,భూషణ్ శ్రీనివాస్,సూరజ్ ఎమ్మార్పీఎస్ నాయకులు రొడ్డ ప్రవీణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.