ఛలో హైదరాబాద్ విజయవంతం చేయండి ..

Hello Hyderabad make it successful..– కరపత్రాలు, గోడ ప్రతులు ఆవిష్కరణ
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న  నిర్వహించ తలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులు పాలెపు కిషోర్ మాదిగ కోరారు. వేల గొంతులు, లక్షల డప్పులు మహా సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు ఆదివారం  మండల కేంద్రంలోని మాదిగ సంఘంలో వేల గొంతులు, లక్షల డప్పుల గోడ ప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులు పాలెపు కిషోర్ మాదిగ, మాజీ ఎంపిటిసి మైలారం సుధాకర్ మాదిగ మాట్లాడుతూ ఫిబ్రవరి 7 నాడు జరిగే వేల గొంతులు, లక్షల డప్పులు మహా ప్రదర్శనను కమ్మర్ పల్లి మండలం  నుంచి వేలాదిగా డప్పులతో బయల్దేరి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి మాదిగ ఇంటికి కరపత్రం చేరేలా చూడాలని మాదిగ సంఘ సభ్యులను కోరారు. కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల కోశాధికారి పోడేటి ధర్మయ్య, పత్రి శ్రావణ్, మైలారం రాజేందర్, కొంటి కంటి నరేందర్, మైలారం బాలు, మారుతి, క్రాంతి, మహేష్, బాలయ్య, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.