
నవతెలంగాణ – కామారెడ్డి
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే నేటి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్ నాయక్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లోని ఇంద్ర పార్క్ లో వందలాదిమంది రైతులు, కార్మికులు, ప్రజలు బడ్జెట్లో తమ వాటా కోసం, కేంద్ర ప్రభుత్వం మోసపూరితమైన బడ్జెట్ను పూనం పరిశీలించాలని డిమాండ్తో చలో ఇంద్ర పార్క్ ను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మోసం చేసే బడ్జెట్ను కేటాయించి బడా బాబులకు పట్టం కట్టే విధంగా ఈ బడ్జెట్ను తయారు చేశారన్నారు. గత ఎనిమిది మాసాల నుంచి రైతులకు రుణమాఫీ చేయాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని దానికో చట్టం చేయాలని రైతుల పోరాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం 10 సంవత్సరాల కాలం నుండి రైతులను మోసం చేస్తూనే వస్తుందన్నారు. మూడు నల్ల చట్టాలను దొంగ దారిలో ఇంప్లిమెంట్ చేస్తానే ఉన్నారు. దానికోసం రాష్ట్రవ్యాప్త ప్రజాసంఘ పిలుపులో భాగంగా రైతు సంఘం ముందు భాగం నిలబడి పోరాడుతుందని ఈ పోరాటంలో వేలాదిమంది రైతులు ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవి పుమానాయక్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.