
బీజేపీ ప్రభుత్వం మాలపట్ల చిన్నచూపు చూడడం సిగ్గుచేటని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ ర్యాకము శ్రీరాములు అన్నారు. వర్గీకరణ వద్దు కలిసి ఉంటే ముద్దు అనే నినాదంతో మాలలు పనిచేస్తూ ఉంటే బిజెపి ప్రభుత్వం వారిపట్ల నిర్లక్ష్య వహించడం సిగ్గుచేటని అన్నారు. ఈ యొక్క ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం సరికాదని మండిపడ్డారు మాలలంతా ఏకమైతే బిజెపి పార్టీని తుంగలో తొక్కడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాలలు ఐక్యంగా ఉండి బీజేపీ పార్టీని కనుమరుగు చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈనెల 25 రోజున కాకినాడ లో జరగనున్న రాజ్యాంగ సభకు నాయకులు తప్పకుండా రావాలని అన్నారు. ఈ యొక్క మహా ధర్నాకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరుకావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ మాలమహానాడు రాష్ట కోఆర్డినేటర్ ర్యాకం శ్రీరాములు అక్బర్ పేట భూoపల్లి మండలకేంద్రం లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య సమత సైనికుధల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అసది పురుషోత్తం మంచిర్యాలమాలమహానాడు జిల్లా అధ్యక్షులు గజ్జెల్లి లచ్చన్న. సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.