ఛలో నల్గొండ బహిరంగ సభను విజయవంతం చేయాలి

– బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య
నవతెలంగాణ – పెద్దవంగర
నేడు నల్లగొండలో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమేశ్వర్ రావు అన్నారు. సోమవారం వడ్డెకొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కృష్ణ బేసిన్ ప్రాజెక్ట్ లను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. కేంద్రం నుండి తెలంగాణ సాగునీటి జలాల హక్కులను కాపాడుకోవడానికి కేసీఆర్ పోరాటం చేస్తాడని చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు ముత్తినేని శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుకుని, ఆయన నివాసంలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్, గ్రామ రైతు కోఆర్డినేటర్ మల్లికార్జున చారి, మండల పరిషత్ కోఆప్షన్ మెంబెర్ ఎండీ ముజీబుద్దీన్, మండల అధికార ప్రతినిది బానోత్ సోమన్న, గ్రామ పార్టీ అధ్యక్షుడు కేశబోయిన కుమారస్వామి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలుక బిక్షపతి, పెద్దవంగర మాజీ ఉపసర్పంచ్ శ్రీరాం రాము, నూనవత్ బాలు నాయక్, దంతాలపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.