గ్రామపంచాయతి కార్మికులసమస్యల పరిష్కారానికై జూన్ 26న చలో నిజామాబాద్

నవతెలంగాణ – కంటేశ్వర్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి 26న చలో నిజాంబాద్ తలపెట్టడం జరిగిందని గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ పిలుపు వచ్చింది. ఈ మేరకు శుక్రవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతి కార్మికుల వేతనాలు పెంచి పెర్మనెంట్ చేయాలని గ్రామపంచాయతి కార్మికుల జేఏసీ పిలుపుమేరకు 2023 జూన్ 26 తేదీన చలో నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహన్ ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి దాసు, , యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేష్ గంగాధర్ ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. కాజా మొయినుద్దీన్, జేపీ గంగాధర్ లు పంచాయతి కార్మికులకు పిలుపునిచ్చారు. జూన్ 17 తేదీన రాష్ట్ర పంచాయతీ కమిషనర్ని రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఆధ్వర్యంలో కలిసి కార్మికుల సమస్యల్ని వివరించడం జరిగిందని దాసు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 50 వేల కార్మికుల్ని వెంటనే క్రమబద్ధీకరించాలని, పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమాద బీమా 10 లక్షలు కట్టాలని వారు డిమాండ్ చేశారు. మోడీ తెచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రాష్ట్రంలో అమలు చేయమని అసెంబ్లీ తీర్మానం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను వారు కోరారు. ప్రజారోగ్యం కోసం శ్రమించి పనిచేసే కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిచో జులై 6 నుండి నిరవేదిక సమ్మెకు దిగవలసి వస్తుందని రాష్ట్ర జేఏసీ నిర్ణయించిందని వారు తెలిపారు. జూన్ 26న చలో నిజామాబాద్ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ ప్రగశీల గ్రామపంచాయితివర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) జిల్లా ప్రధాన కార్యదర్శి జేపీ గంగాధర్ భానుచందర్, చొప్పరి గంగాధర్ సిఐటియు నాయకులు సాగర్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.