నేడు చలో రాజ్‌భవన్‌

– కాంగ్రెస్‌ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వ హించాలని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్‌ కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈనెల 13న చలో రాజ్‌భవన్‌ నిర్వహించాల్సి ఉందనీ, అదే రోజు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఉండటంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందువల్ల కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం 10 గంటలలోపు గాంధీ భవన్‌కు పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.