నేడు చలో రాజ్‌భవన్‌

– టీపీసీసీ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అమెరికాలో గౌతమ్‌ అదానిపై వచ్చిన ఆర్థిక అవకతవకలకు నిరసనగా బుధవారం చలోరాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రదర్శనకు పార్టీశ్రేణులు భారీగా తరలిరావాలని ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద భారీ జనసమీకరణతో రాజ్‌భవన్‌ వరకు ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు పాల్గొంటారు.