– ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు శివలింగం, విద్యాసాగర్..
నవతెలంగాణ- రాయపోల్
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన సెప్టెంబర్ 1 న చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు శివలింగం విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలనీ,రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కొరకు పీఆర్సీ కమిటీని వేయాలన్నారు.ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాదులోనీ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నూతన జాతీయ విద్యా విధానం -2020 రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఉద్యోగుల కొరకు పిఆర్సి కమిటీ వేయాలని,జులై 1 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో కోర్టు కేసులను పరిష్కరించి ఉపాధ్యాయుల పదోన్నతుల బదిలీలు చేపట్టాలని,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,పండిట్,పిఈటీలకు ప్రమోషన్ కల్పించాలని పాఠశాలలో స్కావెంజర్లను నియమించి పాఠశాల పరిశుభ్రతను కాపాడాలన్నారు కేజీబీవీ, గురుకుల ఉపాధ్యాయుల, సమగ్ర శిక్ష ఉద్యోగుల తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 1న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించే మహాధర్నాకు సిద్దిపేట జిల్లాల్లోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.