30న ఛలో ఎస్పిడి కార్యాలయం జయప్రదం చేయండి..

On 30th Chalo SPD office Jayapradham..– ఐఎఫ్టియు జిల్లా ప్రధానకార్యదర్శి ఎం సుధాకర్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కేజీబీవీ, యుఆర్ఎస్, మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్, వర్కర్లకు బేసిక్ పే అమలు కోసం, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) ఆధ్వర్యంలో ఈనెల 30న జరిగే చలో ఎస్.పీ.డీ , (హైదరాబాద్) కార్యాలయం పిలుపును జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ అన్నారు. మంగళవారం డిచ్ పల్లి మండలం లోని కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్ వద్ద పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీ, యుఆర్ఎస్, మోడల్ స్కూల్ నాన్ టీచింగ్, వర్కర్లకు వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ముఖ్యంగా కాలేజీలుగా అప్ గ్రేడ్ ఐన కేజీబీవీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలన్నారు. రిటర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. వంట పాత్రలు ఇతర సామాగ్రిని సరిపడా కొత్తవి అందించాలన్నారు. డ్యూటీచార్ట్ అమలు చేసి, పనిభారం తగ్గించాలన్నారు. కంప్యూటర్ ఒకేషనల్ ఇన్స్ స్టక్టర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలన్నారు. ఏఎన్ఎం లకు నైట్ డ్యూటీలు తగ్గించాలన్నారు. నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీలు చేపట్టాలన్నారు.  గత, ప్రస్తుత ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీ మేరకు నాన్ టీచింగ్, వర్కర్లను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పై డిమాండ్ల సాధన కోసం ఈనెల 30న యూనియన్ ఆధ్వర్యంలో చలో ఎస్.పి.డి (హైదరాబాద్) ఆఫీస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. జిల్లాలోని అన్ని కేజీబీవీ, యుఆర్ఎస్, మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లు ఈ పిలుపును జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టీ.యు  జిల్లా నాయకులు డి.కిషన్,  బి.మురళి,  మోహన్ కేజీబీవీ, మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ సిబ్బంది సుజాత, గీత, దుర్గ, సుజాత, మంజుల, వనిత, లలిత, పార్వతి, జమున, అనురాధ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.