చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం..

నవతెలంగాణ – చండూరు 
కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి  భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని, అంగడిపేట మాజీ సర్పంచ్ నల్లగంటి మల్లేష్  శుక్రవారం   ఒక ప్రకటనలో తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   నేతృత్వంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు అండగా నిలిచారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.