భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జయం ఫంక్షన్ హాల్లో మండల ముఖ్య నాయకుల తో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయల పనులను చేసినట్లు తెలిపారు గంధ మల్ల రిజర్వాయర్ను 1.5 టిఎంసి గా మార్చనున్నట్లు తెలిపారు ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు గడీల పాలన పోయింది ఢిల్లీ పాలన పోవాలని అన్నారు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గాలంటే కేంద్రంలో బిజెపిని ఓడించాలని అన్నారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఎంపీ స్థానాలను గెలిపించి కానుకగా ఇవ్వాలని అన్నారు అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు ఎమ్మెల్యే కు ఎంత మెజారిటీ ఇచ్చారు ఎంపీకి కూడా లక్ష మెజార్టీ ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 14 ఎంపీలు గెలుస్తామని అన్నారు.కార్యకర్తలు సైనికులు వాలే పనిచేసి ప్రచారాన్ని ఇంటింటికి నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనావత్ శంకర్ నాయక్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి నరసింహులు జిల్లా ఉపాధ్యక్షులు ఏలగల రాజయ్య మండల మహిళా అధ్యక్షురాలు అయినాల చైతన్య మహేందర్రెడ్డి నాయకులు పలువుల శ్రీనివాస్ పూలపల్లి వెంకటేష్ గడ్డమీది నిఖిల్ గౌడ్ బాలు యాదవ్ సుంకరిసెట్టయ్య పాన్గల కిష్టయ్య మారగొని వెంకటేష్ గౌడ్, రాజారాం నాయక్ బొత్త రాములు సోమల వెంకటేష్ పోరెడ్డి మహిపాల్ రెడ్డి బాబు నాయక్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి వెలగల వెంకటేశ్వర్లు ఎరుకల వెంకటేష్ గౌడ్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.