
భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం ఖాయమని కాంగ్రెస్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు అంత చంద్రశేఖర్ గౌడ్ దీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో కనివిని ఎరగని రీతిలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో విజయం వైపు దూసుకుపోతుందన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ఉన్నాయా లేవా అనే విధంగా పోటీ అనేది కాంగ్రెస్లోని ఆయా నియోజకవర్గాలకే ఏర్పడినట్టుగా కనిపిస్తుందన్నారు. చూస్తుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు లక్షల పై చిలుకు మెజార్టీతో గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. బిఆర్ఎస్ తీసుకున్న పరిస్థితి , కొంతమందితో బీజేపీ వాపును చూసి బలుపు అనే పరిస్థితిలో కనిపిస్తుంది ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి అయిన బూర నర్సయ్య గౌడ్ గౌడ సామాజిక వర్గాన్ని నా వైపే ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
గెలుపు ఖాయం ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్న ఈ సందర్భంలో వారికి సూచించే విషయం ఏమిటంటే గౌడ సామాజిక వర్గాన్ని ఓట్లు అడిగే నైతిక అర్హత నరసయ్య గౌడ్ కు లేదంటూ డిమాండ్ చేశారు. 2019లోని సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ లో ఉంటూ గొంగిడి సునీత అనే అభ్యర్థికి గౌడ ఆశీర్వాద సభ నిర్వహిస్తూ ఒక గౌడ్ ని ఓడించిన పరిస్థితి ఎవరు మర్చిపోలేదని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడానికి ఎన్నో కారణాలు అన్నయ్యని,అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం కుటుంబ పాలన రాజకీయాలని బ్రష్టు పట్టిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ పార్టీ మారడం జరిగిందన్నారు. బూర నరసయ్య గౌడ్ అనే వ్యక్తి అసలు పార్టీ ఎందుకు మారారు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది, ఒక కులం ముసుకులో రాజకీయాలు చేసిన వ్యక్తి ఎప్పుడు రాజకీయాల్లో రాణించలేరు ఒక డాక్టర్ గా బూర నర్సయ్య గౌడ్ ను అభిమానిస్తాం కానీ రాజకీయాల కోసం ఒక వర్గాన్ని వాడుకోవాలని దానికి మేము వ్యతిరేకిస్తున్నాం అన్నారు. రాజకీయాల్లో సమాజం సేవ చేయడానికి కావాల్సింది కులం మతం కాదు మన రక్తంలో సేవ చేసే గుణం ఉండాలి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, భువనగిరి ఇంచార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం తో భువనగిరి అభ్యర్థిని గెలిపించుకొని అభివృద్ధి కోసం బాటలు వేసుకుందాం అన్నారు.