నవతెలంగాణ -చండూరు: రంగు రంగు పార్టీలను మారుస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని బీఆర్‌ఎస్ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఆందోల్ మైసమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి చండూరు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ.. గురువారం స్థానిక చౌరస్తాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నిక తరువాత రూ.571కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపట్టామని అది చూసి మరొక సారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. పాలేవో, నీళ్లు ఏవో ప్రజలకు అర్థమైందని అన్నారు. నియోజకవర్గ నుంచి ప్లోరిసిస్ రాక్షసిని తరిమికొట్టాం అని, త్వరలో చర్లగూడెం రిజర్వాయర్ ను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తాం అని తెలంగాణ తల్లి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానని అన్నారు. సాగు నీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ చేశారు. అభివృద్ధి చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయిని, పనులు ఆపాలని కుట్రలు చేస్తున్నాయన్నారు. రాజగోపాల్ రెడ్డి డబ్బు, మద్యం బలం తో ఒక్క కొబ్బరికాయ కొడితే పనులన్నీ అయ్యిపోతాయని ప్రజలను మోసం చేస్తున్నారని గుర్తు చేశారు. ఎంపీ గా, ఎంఎల్సీ గా తెచ్చిన నిధులు తెలీదు కాని డంపింగ్ యార్డు మాత్రం తెచ్చి చౌటుప్పల్ ను కంపుగా మార్చారని ఎద్దేవా చేశారు. తన కాంట్రాక్టులు గురించి పార్టీలను అమ్ముకుంటాడని కోమటిరెడ్డిని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందన్నారు. ఉప ఎన్నిక తరువాత బారెడు పనులు, కారు నిండా నిధులు తెచ్చినప్పటికి బెత్తడు సమయం మాత్రమే ఉందని అవి పూర్తి చేయటానికి మరొక సారి అవకాశం ఇవ్వాలని కోరారు. రూ. 30 కోట్లతో మున్సిపాలిటీలో పనులు జరుగుతున్నాయని, గ్రామంలో రూ. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి ఇద్దరు కాంట్రాక్టర్లు ఓట్ల కోసం వస్తున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. నారాయణ పురం మండలాన్ని ఎచ్ఎండీఏ పరిధిలో కలుపుతామని, మర్రిగూడంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఒట్టేసి చెబుతున్నా.. అమ్మ నాన్న సాక్షిగా చెబుతున్న చెప్పిన ప్రతిపని చేస్తానాని ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. అంతకుముందు ఆందోల్ మైసమ్మ గుడి నుంచి చండూరు వరకు భారీ జన సందోహంతో ర్యాలీ నిర్వహించారు. ఆనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్, రాష్ట్ర కలు గీత కార్పొరేషన్ ర్మన్ పల్లె రవి కుమార్, చండూరు జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మున్సిపల్ చైర్మన్ తోకల చంద్ర కళవెంకన్న, సీనియర్ నాయకులు మునగాల నారాయణ రావు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.