చాంపియన్స్‌ మానవ్‌, అహిక

ముగిసిన జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ
హైదరాబాద్‌ : యుటీటీ జాతీయ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ శుక్రవారం తుది పోటీలతో ముగిసింది. ఆరు రోజుల పాటు సాగిన జాతీయ టోర్నీల్లో సింగిల్స్‌ చాంపియన్స్‌గా మానవ్‌ టక్కర్‌, అహిక ఛటర్జీ నిలిచారు. మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్లో మానవ్‌ టక్కర్‌ 5-11చ 13-11చ 8-11చ 11-3, 11-4, 12-10తో తెలంగాణ ప్యాడ్లర్‌ స్నేహిత్‌పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అహిక ఛటర్జీ 11-5, 11-7, 11-4, 9-11, 11-4తో దియ చిటాలెపై గెలుపొందింది. అండర్‌-19 బార్సు విభాగంలో బోధిసత్వ చౌదరి, ఆకాశ్‌లు విన్నర్‌, రన్నరప్‌గా నిలువగా.. గర్ల్స్‌ విభాగంలో సయాలి వాని (మహారాష్ట్ర) 7-11, 11-8, 11-9, 5-11, 18-16, 11-5తో సుహాన సైని (హర్యానా)పై పైచేయి సాధించి టైటిల్‌ అందుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ఆకాశ్‌ పాల్‌, బైస్య జోడీ 11-13, 11-9, 11-4, 11-9తో అనుకూర్‌, దత్తలపై గెలుపొందారు. భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కమలేశ్‌ మెహత, తెలంగాణ టేబుల్‌ టెన్నిస్‌ సంఘం అధ్యక్షురాలు మహేశర్విలు ఇతర ఆఫీస్‌ బేరర్లలతో కలిసి బహుమతులు ప్రదానం చేశారు.