– నిఖత్ జరీన్ ఫౌండేషన్ ఆవిష్కరణలో మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-హైదరాబాద్: ఇప్పుడు ఫౌండేషన్ ఏర్పాటుతో తెలంగాణలో చాంపియన్లను తయారు చేయాలనే మంచి సంకల్పంతో ముందుకొచ్చింది. నిఖత్ జరీన్ ఫౌండేషన్ ఏర్పాటు హర్షనీయం అని తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. షేక్‌పేట్‌లోని జిహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్ కుమార్ గౌడ్.. నిఖత్ జరీన్ ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిఖత్ జరీన్, తెలంగాణ బాక్సింగ్ సంఘం ఆఫీస్ బేరర్లు, బాక్సింగ్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
చాంపియన్ హుస్సాముద్దీన్: 8వ ఎలైట్ మెన్స్ తెలంగాణ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ బాక్సర్ హుస్సాముద్దీన్ చాంపియన్‌గా నిలిచాడు. నిఖత్ జరీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో పురుషుల 60 కేజీల విభాగంలో హుస్సాముద్దీన్ గెలుపొందాడు. ఫైనల్లో హుస్సాంపై 5-0తో ఏకపక్ష విజయం నమోదు చేసిన హుస్సాముద్దీన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.