దుబాయ్ : 2025 చాంపియన్స్ ట్రోఫీ టూర్ గ్లోబల్ షెడ్యూల్‌ను ఐసీసీ శనివారం విడుదల చేసింది. నవంబర్ 16 నుంచి 22 వరకు ఆరు రోజుల పాటు పాకిస్థాన్‌లో ట్రోఫీ టూర్ జరుగనుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ట్రోఫీ టూర్‌ను ఐసీసీ రద్దు చేసింది. పాకిస్థాన్‌లో ట్రోఫీ టూర్ అనంతరం టోర్నీలో ఆడే ఇతర దేశాలకు ట్రోఫీ వెళ్లనుంది. వచ్చే ఏడాది జనవరి 15-26న భారత్‌కు చాంపియన్స్ ట్రోఫీ రానుంది. 12 రోజుల పాటు భారత్‌లో ట్రోఫీ టూర్ జరుగనుంది. అనంతరం జనవరి 27న పాకిస్థాన్‌కు తిరిగి ట్రోఫీ చేరుకోనుంది. పాక్‌లో భారత్ ఆడే అవకాశాలు లేకపోవటంతో హైబ్రిడ్ మోడల్‌లో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.